డ్రగ్స్ రహిత సమాజం కోసం ఓయూ పోలీసుల వినూత్న ప్రయత్నం

by Batti.Sumithra |

యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గోదారి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం ఓయూ పోలీసుల వినూత్న ప్రయత్నం
X

దిశ, సికింద్రాబాద్ : యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గోదారి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ సీఐ మహేష్ కుమార్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తుకు పునాదని అన్నారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా క్రీడల పై దృష్టి సారించాలని సూచించారు.

క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. యువతలో ప్రతిభను వెలికితీసి, వారిని క్రీడారంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు పోలీస్ శాఖ తరఫున ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. "డ్రగ్స్‌కు నో చెప్పండి.. క్రీడలకు యెస్ చెప్పండి" అనే సందేశాన్ని ప్రతి యువకుడు ఆచరించాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులు ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించగా, విజేతలు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు జై చంద్ర, ఎస్‌ఐ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story