అదిరిపోయే ట్విస్టులతో ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్

by Mallepaka Hamsa |

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో సుమంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు.

అదిరిపోయే ట్విస్టులతో ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘న్యూటన్స్ థర్డ్ లా’. ఇందులో సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ చిత్రం జూలై 31న థియేటర్స్’లోకి రాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో సుమంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఒక అనుమానాస్పద హత్య కేసును ఆయన విచారిస్తుండటం, జగపతి బాబు విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆశ్చర్యపరచడం ఆకట్టుకున్నాయి. అద్భుతమైన ట్విస్టులతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గత పదేళ్లలో తాను ఒక్కసారి కథ వినగానే ఒకే చెప్పిన సినిమాలు రెండే రెండు ఉన్నాయని, అందులో ఒకటి ‘మళ్లీ రావా’ అయితే, రెండోది ఈ ‘న్యూటన్స్ థర్డ్ లా’ అని వెల్లడించారు. ‘అనగనగా’ సినిమా కంటే ముందే డైరెక్టర్ తనకు ఈ కథ చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కంటే కూడా కథను నడిపించే స్క్రీన్‌ప్లేనే అసలైన హీరో అని సుమంత్ ప్రశంసించారు. బయటకు థ్రిల్లర్‌లా కనిపించినా, ఇందులో ఎంతో లోతైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పారు. చాలామంది టైటిల్ మార్చమని చెప్పినప్పటికీ, కథకు ఇదే సరైన పేరని తాను పట్టుబట్టి ఉంచినట్లు తెలిపారు. ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువేనని, థియేటర్లలో ప్రేక్షకులకు మరెన్నో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.


Next Story