- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు
పార్టీ ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు...

దిశ, వెబ్ డెస్క్: పార్టీ ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం అందించిన రెండేళ్ల సేవలపై సోమవారం నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు స్థానికల్లో అన్ని స్థానాలు గెలిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అలాగే అభ్యర్థుల గెలుపులో పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేయాలని సూచించారు. డబ్బుతో ప్రజాభిమానం రాదని, ప్రజల్లోనే ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన చేసిన సేవలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.






