జలదోపిడిని ఆపండి... ఉమ్మడి పాలమూరు జిల్లా అన్యాయమైపోతుంది

by Taduka Kalyani |

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేస్తున్న జల దోపిడీలను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం... ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది అని మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆరోపించారు.

జలదోపిడిని ఆపండి... ఉమ్మడి పాలమూరు జిల్లా అన్యాయమైపోతుంది
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేస్తున్న జల దోపిడీలను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం... ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది అని మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆరోపించారు. తుంగభద్ర, కృష్ణా నదులపై ఎక్కడికక్కడ చెప్పు రెడ్డి బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మించుకోవడం ద్వారా దిగువ భాగంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నీటి వాట రాకుండా కర్ణాటక ప్రభుత్వం, వచ్చిన నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డిల సారధ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కర్ణాటకకు తరలారు. భీమా ప్రాజెక్ట్ పై నిర్మించిన గూడూరు ప్రాజెక్టు నుండి నీళ్లు క్రిందకు రాకుండా హైడ్రాలిక్ గేట్లను బిగించిన దృశ్యాన్ని, గూగల్ వద్ద భారీ ఎత్తున నిర్మించిన ప్రాజెక్టును పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి ఉండడానికి చూశారు.

అనంతరం మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు రావలసిన నీటి వాటాను విడుదల చేయకుండా కర్ణాటక ప్రభుత్వం ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, కుంటలను నింపుకొని పంటలు పండించుకుంటున్నారు. ఆర్డీఎస్ తదితర ప్రాంతాల నుండి ఆంధ్ర ప్రభుత్వం నీటి నీ కొల్లగొట్టుకు పోతుంటే తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే పరిస్థితిలో నెలకొన్నయని వారు ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ముఖ్యమంత్రి ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో నీటి వాటాలను గురించి చర్చించారో లేదో కానీ.. తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది అన్నారు. తరతరాలుగా జల దోపిడికి గురవుతున్న ఉమ్మడి పాలమూరు ఎడారిగా మారే పరిస్థితిలు నెలకొంటున్నాయని వారు ఆరోపించారు. ముగ్గురు ముఖ్యమంత్రిలు చర్చించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీ మంత్రులు హెచ్చరించారు.

Next Story