"సర్"పై అప్రమత్తంగా ఉండాలి

by Ratna Kumari |

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చే నెల 10వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు.

సర్పై అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, కామారెడ్డి : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చే నెల 10వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మండల, మున్సిపాలిటీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలైన ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బీఎల్ఓలు అందజేసిన దరఖాస్తు ఫారాలను పూర్తిగా నింపించి, ఆగస్టు 3వ తేదీలోపు సంబంధిత బీఎల్ఓలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం 10వ తేదీన విడుదలయ్యే ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అర్కల ప్రభాకర్ యాదవ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, పార్టీ నాయకులు కాసర్ల స్వామి, ప్రభాకర్ రెడ్డి, బల్వంత్ రావు, నర్సింలు, హనుమాన్లు, కృష్ణాజీ రావు, శశికాంత్, పుల్లూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story