మళ్లీ నీటిలో మునిగిపోయిన పోచమ్మ ఆలయం.. ఆందోళనలో భక్తులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-26 08:34:18  IST  )

గువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీటి ఉధృతి భారీగా పెరిగింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది....

మళ్లీ నీటిలో మునిగిపోయిన పోచమ్మ ఆలయం.. ఆందోళనలో భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి(Godavari)కి వరద నీటి ఉధృతి భారీగా పెరిగింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రాజమండ్రి(Rajahmundry) వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే దేవీపట్నం మండలం(Devipatnam Mandalam) గొందురు(Gonduru)లో గండి పోచమ్మ ఆలయం(Pochamma Temple) నీటి మునిగిపోయింది. ఆలయంలో భారీగా నీరు చేరుకోవడంతో అమ్మవారి విగ్రహం సగం వరకు నీట మునిగిపోయింది. దీంతో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. నదీపరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.

గోదావరి నీటిమట్టం పరిశీలన

మరోవైపు గోదావరి తాజా నీటిమట్టాన్ని అంచనా వేస్తూ అప్రమత్తత ప్రకటించారు. పోచమ్మ ఆలయంలో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. భక్తులతో ఈ ఆలయం ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఆలయంలోకి నీరు చేరింది. అయితే నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం మళ్లీ గోదావరి వరద ఆలయంలో చేరింది.

Next Story