- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ షర్మిల త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇటీవలే ఆమెకు ఓ సర్జరీ జరగ్గా.. ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కడుపుకు సంబంధించిన సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని, మనోధైర్యంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా షర్మిల త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సంపూర్ణ ఆరోగ్యంతో.. త్వరగా ఆమె ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.
Next Story






