- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరుగుడు తోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 20 ఎకరాల్లో మంటలు
by Vemula.Srinu Prasad |
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలమోరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని సరుగుడు తోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ...

X
దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలమోరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని సరుగుడు తోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ప్రమాదంలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సరుగుడు తోటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంతమంతా నల్లటి పొగలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతకు స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నికీలలు ఆర్పడం ఫైర్ సిబ్బందికి సవాలుగా మారింది.
Next Story






