- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నదిపై బోటింగ్ సేవలు నిలిపివేత
కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి సంగమేశ్వరం ఆలయానికి నిర్వహిస్తున్న బోటింగ్ సేవలను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేసినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు.

దిశ, కొల్లాపూర్ : కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి సంగమేశ్వరం ఆలయానికి నిర్వహిస్తున్న బోటింగ్ సేవలను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేసినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కృష్ణా నదిలో వరద జలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున సోమశిల–సంగమేశ్వరం మధ్య బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో సంగమేశ్వరం ఆలయ దర్శనం కోసం సోమశిలకు ఎవరూ రావద్దని, అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దని పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. వరద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే బోటింగ్ సేవలను పునఃప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.






