- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్ష హెచ్చరిక: మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో మోస్తరు వానలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలకు వెదర్ మ్యాన్ రెయిన్ అలర్ట్ (Rain alert) ప్రకటించారు. రాబోయే రెండు గంటల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు మధ్యాహ్నం అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం యాదాద్రి - భువనగిరి, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఈ వర్ష ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి రెండు గంటల్లో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలకు ఈ వర్షాలు విస్తరిస్తాయని వెల్లడించారు.
దీంతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదు కానుందని వెదర్ మ్యాన్ అలర్ట్‌లో పేర్కొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమొదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






