- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాలాపేట వైన్స్‌లో ఘర్షణ.. ఆరుగురిపై కేసు నమోదు
లాలాపేటలోని యాదగిరి వైన్స్‌లో జరిగిన ఘర్షణలో పలువురు గాయపడిన ఘటనపై లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దిశ, సికింద్రాబాద్: లాలాపేటలోని యాదగిరి వైన్స్‌లో జరిగిన ఘర్షణలో పలువురు గాయపడిన ఘటనపై లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి సుమారు 10:40 గంటలకు ఫిర్యాదుదారు తన స్నేహితులతో కలిసి యాదగిరి వైన్స్‌లో మద్యం సేవిస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి బీర్ బాటిళ్లను పగలగొడుతూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో పగిలిన బీర్ బాటిల్ ముక్కలు తగిలి ఫిర్యాదుదారుతో పాటు అతని స్నేహితులకు గాయాలయ్యాయి.
అంతేకాకుండా, సుమారు ఆరుగురు అపరిచిత వ్యక్తులు కలిసి తమపై చేతులతో దాడి చేశారని, ఫిర్యాదుదారుపై పగిలిన బీర్ బాటిల్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం బాధితుడి లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






