- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని పాదయాత్ర
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగు యువత ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. హిందూపురం నుండి కదిరి వరకు 75 కి.మీ మేర రెండు రోజుల పాటు నాయకులు పాదయాత్ర చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగు యువత ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. హిందూపురం నుండి కదిరి వరకు 75 కి.మీ మేర రెండు రోజుల పాటు నాయకులు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రకు ముందు పేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూపురం నుండి గోరంట్ల, ఓడిసి మీదుగా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి అక్కడ పూజలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బాలక్రిష్ణ ఇటీవల కాకినాడ షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయం కావడంతో అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో బాలయ్య మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. కాలి కండరాలు వాపు రావడంతో వైద్యులు సర్జరీ చేసి సరిచేశారు. నేడు సీఎం చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రిలో బాలయ్యను పరామర్శించారు.






