- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ చికిత్స అందేలా చూడండి.. కేటీఆర్‌కు కేసీఆర్ ఆదేశాలు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. వెంట ఉండి పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. వెంట ఉండి పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశించారు. సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెంది ఆయన ఆరోగ్యంపై కేసీఆర్ ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోద్ మరియు జిల్లా నేతలతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. తొమ్మిది సార్లు సీపీఆర్ చేయగా తొమ్మిదోసారి ఆయన స్పందించినట్టు పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి బీపీ, పల్స్ బాగున్నాయని శ్వాస కూడా తీసుకుంటున్నారని తెలిపారు. వరంగల్ లో ప్రాథమిక చికిత్స అనంతరం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మెరుగైన చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.






