ప్రధాని మోదీ బ‌హిరంగ స‌భ ఏర్పాట్లపై మంత్రుల స‌మీక్ష

by Ajay Maddhiboyina |

ప్ర‌ధాని మోడీ బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌పై రాష్ట్ర మంత్రులు స‌మీక్షించారు. ఆగ‌స్టు 1న ప్ర‌ధాని అల్లూరి సీతారామరాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్వ‌వ స‌భ‌కు వ‌స్తుండ‌టంతో ఏర్పాట్ల‌పై జీఎంఆర్ ఎయిర్ పోర్టులో మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి, గుమ్మ‌డి సంధ్యారాణి, బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి స‌మావేశంం అయ్యారు.

ప్రధాని మోదీ బ‌హిరంగ స‌భ ఏర్పాట్లపై మంత్రుల స‌మీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ధాని మోడీ బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌పై రాష్ట్ర మంత్రులు స‌మీక్షించారు. ఆగ‌స్టు 1న ప్ర‌ధాని అల్లూరి సీతారామరాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్వ‌వ స‌భ‌కు వ‌స్తుండ‌టంతో ఏర్పాట్ల‌పై జీఎంఆర్ ఎయిర్ పోర్టులో మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి, గుమ్మ‌డి సంధ్యారాణి, బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి స‌మావేశంం అయ్యారు. ఈ స‌మావేశంలో ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిశీల‌కులు సైతం పాల్గొన్నారు. స‌మావేశంలో ప‌లు జిల్లాల నుండి భారీగా జ‌న‌సేక‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల నుండే ఎక్కువ మందిని తీసుకురావాల‌ని నిర్ణయించారు. అదేవిధంగా విశాఖ‌, శ్రీకాకుళం జిల్లా నియోజ‌క‌వ‌ర్గాల నుండి కూడా జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని చ‌ర్చించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రైవేట్ పార్కింగ్ స్థ‌లాల‌ను ఎంపిక చేయాల‌ని, స‌భ‌కు వ‌చ్చేవారికి టిఫిన్, మ‌ధ్యాహ్న భోజనం, స్నాక్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అదేవిధంగా ఎయిర్ పోర్టులో 13వేల మందితో అర‌కు థింసా గిరిజ‌న నృత్యంతో ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికేలా ఏర్పాట్లు చేయాల‌ని అనుకున్నారు. ఉద‌యం 10.30గంట‌ల‌కు మోడీ స‌భ ప్రారంభం కానుండ‌గా ఉద‌యం 8గంట‌ల‌కే వేదిక వ‌ద్ద‌కు ప్ర‌జ‌ల‌ను చేర‌వేసేలా ప్లాన్ చేశారు.

Next Story