ఇది మునుపెన్నడూ లేని విధంగా వేడుక జరుపుకునే సమయం.. ‘OM’ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్

by Mallepaka Hamsa |

ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేసి అభిమానులకు పక్కా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఒక క్రేజీ పోస్టర్‌ను పంచుకున్నారు.

ఇది మునుపెన్నడూ లేని విధంగా  వేడుక జరుపుకునే సమయం.. ‘OM’ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్, అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఓమ్’. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ చేశారు. మూవీ నుంచి మ్యూజికల్ జర్నీని షురూ చేస్తూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూలై 28న ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేసి అభిమానులకు పక్కా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఒక క్రేజీ పోస్టర్‌ను పంచుకున్నారు.

"ఇది మునుపెన్నడూ లేని విధంగా పుట్టినరోజు వేడుక జరుపుకునే సమయం.." అనే ఆసక్తికర క్యాప్షన్‌ను దీనికి జత చేశారు. ఇందులో ధనుష్ వెనక్కి వంగుతూ మాస్ డ్యాన్స్ స్టెప్ వేస్తున్నట్లు కనిపించి సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో పాటు సాయి పల్లవి, శ్రీలీల, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఆర్‌టేక్ స్టూడియోస్ మరియు వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్‌తో 'ఓమ్' చిత్రంపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story