- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala Pushkarini: పది రోజుల పాటు నో ఎంట్రీ
తిరుమల భక్తులకు టీటీడీ అధికారుల అలర్ట్ ప్రకటించారు. దీంతో పుష్కరిణికి మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కరిణీలో నిర్వహించే హారతి కార్యక్రమాన్ని రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల భక్తులకు టీటీడీ అధికారుల అలర్ట్ ప్రకటించారు. మరో పది రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి హారతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంతో పుష్కరిణికి మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కరిణీలో నిర్వహించే హారతి కార్యక్రమాన్ని రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భక్తులు పుష్కరిణిని సందర్శించొద్దని తెలిపారు. కాగా శ్రీవారి ఆలయానికి ఈశాన్య మూలలో ఉన్న స్వామివారి పుష్కరిణీలో భక్తులు స్నాచరిస్తారు. పురాణాల ప్రకారంలో ఇక్కడ నీటిని సేవించినా, స్పరించినా, అందులో స్నానం చేసినా సమస్త పాపాలు పోతాయనే నమ్మకం. దీంతో తిరుమలకు వచ్చిన భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి ఆ తర్వాతే శ్రీవారిని దర్శంచుకుంటారు. అనంతరం స్వామివారి మహా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలా భక్తుల తిరుమల యాత్రను ముగిస్తారు.






