కింద పులి.. పోల్ పైన విద్యుత్ సిబ్బంది

by Batti.Sumithra |

మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ముల్ తాలూకాలో పులి సంచారంతో భయాందోళన నెలకొంది.

కింద పులి.. పోల్ పైన విద్యుత్ సిబ్బంది
X

దిశ, ఆసిఫాబాద్ : మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ముల్ తాలూకాలో పులి సంచారంతో భయాందోళన నెలకొంది. పుల్జరి గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా సిబ్బందికి అకస్మాత్తుగా పెద్ద పులి కనిపించింది. దీంతో ప్రాణభయంతో సిబ్బంది కిందకు దిగ లేక పోల్ పైనే ఉండిపోయారు. దాదాపు గంటపాటు పోల్ పైనే వేచి ఉన్నారు. పులి అక్కడి నుంచి అడవి వైపు వెళ్లిన తర్వాత విద్యుత్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కిందికి దిగి తమ పనులు కొనసాగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారాయి.

Next Story