వైసీపీ ట్రాప్‌లో పడొద్దు : సీఎం చంద్రబాబు హెచ్చరిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-26 10:04:39  IST  )

తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు : సీఎం చంద్రబాబు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై సీఎం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. ఆదివారం నిర్వహించిన పార్టీ టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులకు ఆయన పలు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.

వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు, ఆ పార్టీని "గొడ్డలి పార్టీ"గా అభివర్ణిస్తూ అది ఒక విష వృక్షం లాంటిదన్నారు. ఈ విషయాన్ని ప్రతి తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. నిత్యం కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే వైసీపీ ఏకైక అజెండా అని, ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు వారు నిరంతరం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నాయకులతో వేదికలు పంచుకోవద్దని, వారి ట్రాప్‌లో పడొద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ, మన పూర్తి దృష్టి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగడమే పార్టీ నాయకుల ప్రధాన ధ్యేయమని సీఎం తేల్చి చెప్పారు.

Next Story