- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముత్యాలరావు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన నరేష్ జాదవ్
ఏన్కూర్ మండల పరిధిలోని జన్నారం గ్రామపంచాయతీలో గుమస్తాగా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముత్యాలరావు కుటుంబానికి గ్రామానికి చెందిన నరేష్ జాదవ్ ఆర్థిక సాయం అందించారు.

దిశ, ఏన్కూర్ : ఏన్కూర్ మండల పరిధిలోని జన్నారం గ్రామపంచాయతీలో గుమస్తాగా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముత్యాలరావు కుటుంబానికి గ్రామానికి చెందిన నరేష్ జాదవ్ ఆర్థిక సాయం అందించారు. ముత్యాలరావు దశదిన కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ గుమస్తాగా పనిచేసిన ముత్యాలరావు అందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని మంచి పేరు సంపాదించారని అన్నారు. ముత్యాలరావు కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితిలో ఉండటంతో తమ వంతు సహాయంగా బియ్యం అందించినట్లు తెలిపారు. కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉండగానే ముత్యాలరావు మృతి చెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్యాలయంలో ముత్యాలరావు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని నరేష్ జాదవ్ విజ్ఞప్తి చేశారు.






