ఆంధ్ర హక్కులకు అన్ని కోట్ల డిమాండ్ చేస్తున్న 'ది ప్యారడైజ్' మేకర్స్

by Pulgam srinivas |

రాయలసీమ మినహా ఆంధ్ర థియేట్రికల్ హక్కులకే రూ.35–40 కోట్ల ధరను 'ది ప్యారడైజ్' మేకర్స్ కోట్ చేస్తున్నట్లు సమాచారం.

ఆంధ్ర హక్కులకు అన్ని కోట్ల డిమాండ్ చేస్తున్న ది ప్యారడైజ్ మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులను విక్రయించేందుకు నిర్మాతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నైజాం థియేట్రికల్ హక్కులను మైత్రి సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాయలసీమ మినహా ఆంధ్ర ఏరియా థియేట్రికల్ హక్కుల కోసం మేకర్స్ రూ.35 నుంచి రూ.40 కోట్ల మధ్య ధరను కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాయలసీమ లేకుండానే ఆంధ్ర హక్కులకు ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడం విశేషంగా మారింది. ఈ పెట్టుబడిని రికవరీ చేయాలంటే ఆంధ్ర ప్రాంతంలోనే దాదాపు రూ.70 నుంచి రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాంటి స్థాయి కలెక్షన్లు సాధించాలంటే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం తప్పనిసరి అని వారు భావిస్తున్నారు. మరి చివరికి రాయలసీమ మినహా ఆంధ్ర ఏరియా హక్కులు ఎంత మొత్తానికి అమ్ముడవుతాయో ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఖయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు.

Next Story