- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ ఫోటోగ్రఫీ డే పోటీలు... అర్హులు వీరే..!
ఈ ఏడాది ఆగస్ట్ 19న 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఫోటోగ్రఫీ పోటీలను ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమి నిర్వహిస్తోంది . కళాత్మక ఫోటోగ్రఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఎంతోమంది ఔత్సాహికులకి మార్గదర్శకంగా నిలిచిన వారి జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమి ఈ ఫోటోగ్రఫీపోటీలను నిర్వహిస్తోంది జనరల్ అంశాలకు సంబంధించిన ఏ ఫోటోలు అయినా ఈ పోటీలకు పంపవచ్చు..

దిశ, ఏపీ బ్యూరో: ఈ ఏడాది ఆగస్ట్ 19న 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఫోటోగ్రఫీ పోటీలను ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమి నిర్వహిస్తోంది . కళాత్మక ఫోటోగ్రఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఎంతోమంది ఔత్సాహికులకి మార్గదర్శకంగా నిలిచిన వారి జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమి ఈ ఫోటోగ్రఫీపోటీలను నిర్వహిస్తోంది జనరల్ అంశాలకు సంబంధించిన ఏ ఫోటోలు అయినా ఈ పోటీలకు పంపవచ్చు. కలర్ & మోనోక్రోమ్ విభాగాలలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఫోటోలు పంపించాల్సిన చివరి గడువు ఆగస్టు 2 వ తేదీ.ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫొటోగ్రాఫర్లు మాత్రమే అర్హులు.ఫోటోలు స్వంతంగా తీసినవై ఉండాలి. ఫోటో ఫైల్ సైజ్ 2 ఎం బి కి మించకూడదు
ఫైల్ ఫార్మాట్ జే పి జి లో ఉండాలి. ఒక్కో అభ్యర్ధి ఒక్కో సెక్షన్ లో 3 ఫోటోలను మాత్రమే పంపించాలి. ప్రతి ఫోటోకు టైటిల్ తప్పని సరిగా ఉండాలి. అభ్యర్ధి పేరు, ఫోన్ నంబర్, అడ్రెస్స్ తప్పని సరిగా పంపించాలి. పోటీలలో పాల్గొన దలచిన వారు తమ ఫోటోలను [email protected] పంపించాల్సిందిగా.. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి కానాల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.






