- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
బొల్లారం ఏరియాలోని కంటోన్మెంట్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు.

దిశ, తిరుమలగిరి : బొల్లారం ఏరియాలోని కంటోన్మెంట్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే బిఎల్ఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పూర్తి చేయాలని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ జాబితా ప్రక్షాళన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, ఏ ఒక్క అర్హుడైన పౌరుడు కూడా జాబితా నుంచి విడిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మారేడుపల్లిలోని ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరగనున్న గురుపౌర్ణమి వేడుకలకు ఈఓ, చైర్మన్, కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సమీక్షా సమావేశంలో బిఎల్ఓ లు బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదీర్వన్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, వార్డు అధ్యక్షులు నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాం, కాంగ్రెస్ నాయకులు, బాలరాజు,నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






