- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణమే మంత్రి రాజీనామా చేయాలి: బొత్స
డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: డీఎస్సీ (DSC) నిర్వహణలో అవకతవకలు జరిగాయని, బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satynarayna) డిమాండ్ చేశారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను మారుస్తూ అభ్యర్థులను అయోమయానికి గురిచేశారంటూ బొత్స మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ. 10 వేల కోట్లు నిలిచిపోయాయన్నారు. ఈ బకాయిల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యాసంస్థల నిర్వహణ కూడా కష్టంగా మారిందని బొత్స ఆరోపించారు.
స్పష్టమైన సమాధానం కావాలి
పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. తక్షణమే బకాయిలు విడుదల చేసి నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.






