- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాజీ పార్క్‌లో పోటెత్తిన యువసముద్రం.. విద్యాశాఖ మంత్రి రాజీనామాపై ఘనంగా విజయోత్సవం
నీట్ పరీక్షల పేపర్ లీక్, అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రగిలిన ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ (NEET) పరీక్షల పేపర్ లీక్, అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రగిలిన ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. విద్యార్థుల ఆందోళనల తీవ్రతకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేయడంతో, ముంబైలోని చారిత్రక శివాజీ పార్క్‌లో ఆదివారం (జూలై 26) భారీ విజయోత్సవ ర్యాలీ జరిగింది. ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన యువతతో శివాజీ పార్క్ జనసంద్రంగా మారింది.
ప్రజాస్వామ్య విజయం
ఉదయం నుంచి కురుస్తున్న చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు జాతీయ జెండాలు, రాజ్యాంగ ప్రతులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోస్టర్లను చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మీమ్స్‌ను ప్రదర్శిస్తూ.. ‘ఇది ప్రజాస్వామ్య విజయం’ అని నినదించారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో 36 రోజుల పాటు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు. మంత్రి రాజీనామాతో CJP తమ ఆందోళనను విరమించుకుంది. కాగా, నీట్ పేపర్ లీక్ కుంభకోణం కారణంగా తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. కేవలం ఒక మంత్రి రాజీనామాతో సమస్య తీరదని, విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలని పలువురు యువకులు డిమాండ్ చేశారు.
రాజకీయ పక్షాల మద్దతు
విద్యార్థుల పోరాటానికి శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. యువతకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పిలుపు మేరకు ఈ ‘తిరంగా మార్చ్’ను సంయుక్తంగా నిర్వహించారు.






