- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2036 నాటికి డబ్బు ప్రాధాన్యం శూన్యం.. ఆర్థిక వ్యవస్థపై ఎలాన్ మస్క్ సంచలన అంచనాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ విజృంభణతో రాబోయే పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ విజృంభణతో రాబోయే పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ‘ది ఎకనామిస్ట్’ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ జానీ మింటన్ బెడోస్‌తో జరిపిన ఇంటర్వ్యూలో ఆయన భవిష్యత్ ఆర్థిక వ్యవస్థపై సంచలన అంచనాలను వెల్లడించారు.
అసలు డబ్బుతో పనే ఉండదు..!
మానవులకు అవసరమైన ఆహారం, నివాసం, రవాణా, వినోదంతో సహా అన్ని రకాల వస్తువులు, సేవలను రోబోలు అవసరానికి మించి విపరీతంగా ఉత్పత్తి చేస్తాయని మస్క్ తెలిపారు. వస్తువులు, సేవల కొరత ఉన్నప్పుడే డబ్బుకు విలువ ఉంటుందని... ప్రతిదీ ఉచితంగా లేదా పుష్కలంగా లభించేటప్పుడు ‘2036 నాటికి అసలు డబ్బుతో పనే ఉండదు’ అని స్పష్టం చేశారు. ఉపాధి కోల్పోయే ప్రజలకు ప్రభుత్వాలే నేరుగా ఖజానా నుంచి చెక్కుల ద్వారా ఆర్థిక సాయం అందించవచ్చని ఆయన సూచించారు. సరుకుల ఉత్పత్తి విపరీతంగా పెరగడం వల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం (Inflation) కంటే ‘ద్రవ్యోల్బణ క్షీణత’ (Deflation) అతిపెద్ద ఆర్థిక సవాలుగా మారబోతోందని అంచనా వేశారు.
ఐదేళ్లలో మానవ మేధస్సును దాటనున్న AI
రాబోయే ఐదేళ్లలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోని మనుషులందరి తెలివితేటలను మించిపోతుందని మస్క్ పేర్కొన్నారు. ఇకపై AI పురోగతిని ఆపడం అసాధ్యమని, దానిని సురక్షితమైన మార్గంలో నడిపించడంపైనే ప్రపంచం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. AI సృష్టిస్తున్న ఈ వేగవంతమైన మార్పులు తనను ఒకవైపు ఉత్సాహానికి, మరోవైపు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంటాయని మస్క్ ఒప్పుకున్నారు.






