మంత్రి సీతక్కను కలిసిన ఉప్లూర్ కాంగ్రెస్ నాయకులు

by Ratna Kumari |

కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యులు బస వేణుగోపాల్ యాదవ్ సమక్షంలో మంత్రి దనసరి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి సీతక్కను కలిసిన ఉప్లూర్ కాంగ్రెస్ నాయకులు
X

దిశ, కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యులు బస వేణుగోపాల్ యాదవ్ సమక్షంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన ఉప్లూర్ బైపాస్ బీటీ రహదారి నిర్మాణానికి రూ.5.17 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్కకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల మంజూరు గ్రామ అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు.

అదే విధంగా గ్రామంలోని ఇతర అభివృద్ధి పనులకు కూడా అదనపు నిధులు కేటాయించాలని నాయకులు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు డా. నరేష్, వార్డు సభ్యుడు సాధుల్లా, కాంగ్రెస్ నాయకులు బద్దం రాజేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ సుంకరి విజయ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story