- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు అమ్మేశారు: లోకేశ్‌పై భూమన సంచలన ఆరోపణలు
కూటమి ప్రభుత్వం(Kutami Government) అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ(Megadsc) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని తొలి నుంచి వైసీపీ(Ycp) నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Kutami Government) అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ(Megadsc) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని తొలి నుంచి వైసీపీ(Ycp) నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Former Minsiter Bhumana Karunakar Reddy) అయితే డీఎస్సీలో ఒక్కో పోస్టును మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) రూ. 30 లక్షలకు ఆమ్మేశారని ఆరోపించారు. తిరుపతి(Tirupati)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ(DSC)లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ తరహాలోనే డీఎస్సీలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. స్పోర్ట్ కోటా ఉద్యోగాలను అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. విద్యాశాఖను లోకేశ్ అవినీతిమయం చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని భూమన హెచ్చరించారు.






