- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > గుండెపోటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గ్రీన్ కారిడార్
గుండెపోటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గ్రీన్ కారిడార్
by Taduka Kalyani |
వరంగల్‌లో గుండెపోటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

X
దిశ,ఉప్పల్: వరంగల్‌లో గుండెపోటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు అత్యవసరంగా తరలించారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ వేగంగా ఆస్పత్రికి చేరుకునేలా ఉప్పల్ రింగ్‌రోడ్డుపై పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేసి, అంబులెన్స్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర మార్గం కల్పించారు. పోలీసుల సమన్వయంతో అంబులెన్స్ వేగంగా ప్రయాణించి సకాలంలో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుంది.అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు వేగంగా స్పందించి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story






