ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎఫెక్ట్.. బీజేపీ కంచుకోట బాంకీపూర్ ఉప ఎన్నికల్లో జెన్ జీ ఎటువైపు?

by Prasad Jukanti |

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, జెన్ జీ ఉద్యమ వేళ బాంకీపూర్ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎఫెక్ట్.. బీజేపీ కంచుకోట బాంకీపూర్ ఉప ఎన్నికల్లో జెన్ జీ ఎటువైపు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జెన్ జీ దెబ్బకు మోడీ సర్కార్ దిగివచ్చింది. నెలరోజుల నిరసన తర్వాత ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా కాక్రోచ్ జనతా పార్టీ అంటూ సెటైరికల్‍గా మొదలైన జెన్ జీ ఉద్యమం దేశరాజకీయాలను షేక్ చేయడం ఇప్పుడు బీజేపీలో చర్చగా మారింది. జెన్ జీ ఉద్యమం, ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా త్వరలో జరగనున్న బాంకీపూర్ (Bankipur Bypoll) అసెంబ్లీ నియోకవర్గం ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇన్నాళ్లు మోడీ చరిష్మాతో తిరుగులేదని అనుకున్న బీజేపీకి ఈ ఎన్నిక రూపంలో మరో అగ్నిపరీక్షగా ఎదురుకాబోతోందా అనేది ఉత్కంఠగా మారింది.

ట్రయాంగిల్ ఫైట్:

బాంకీపూర్ బై పోల్ ఇప్పుడు కేవలం బిహార్ కే పరిమితం కాలేదు. ఈ ఉప ఎన్నిక బీజేపీతో పాటు జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, రాజ్యసభకు ఎన్నికైన నితిన్ నవీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి జులై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నిక ఒకవైపు బీజేపీ సంస్థాగత బలానికి, నితిన్నబీన్‌ రాజకీయ వారసత్వానికి పరీక్ష కాగా మరో వైపు 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు బరిలోకి దిగారు. హాఘట్‌బంధన్‌లోని కాంగ్రెస్‌ను కాదని ఆర్జేడీ ఇక్కడ సొంత అభ్యర్థిని నిలబెట్టింది. అయితే బీజేపీకి కంచుకోటగా నిలిచిన బాంకీపూర్ స్థానంలో ఎవరి జెండా ఎగరబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

కీలక శక్తిగా జెన్ జీ ఓటర్లు:

దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థి నిరసనలు రాజకీయ చర్చను పూర్తిగా మార్చివేసిన వేళ బాంకీపూర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు జంతర్ మంతర్ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో బిహార్ లో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల బిహార్ పోలీసులు లాఠీచార్జీకి పాల్పడటం తీవ్ర దుమారం రేపింది. ఇక్కడ మొత్తం నాలుగు లక్షల ఓటర్లు ఉండగా యువ ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. దాదాపు 1.20 లక్షల నుండి 1.35 లక్షల మంది (మూడో వంతు) 18 నుండి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే కావడం విశేషం. అలాగే పాట్నా యూనివర్సిటీ, ఎన్ఐటీ పాట్నా, బీఎన్ కాలేజ్, సైన్స్ కాలేజ్, చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు అనేక కోచింగ్ సెంటర్లు ఇదే నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. విద్యా, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు ఈ 'జెన్ జీ' విభాగాన్ని రాజకీయంగా చైతన్యవంతం చేశాయి. దీంతో వీరంతా ఇప్పుడు ఎవరి పక్షాన నిలబడబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. బీజేపీకి కంచు కోటగా ఉన్న బాంకీపూర్ అసెంబ్లీ స్థానం ఈ సారి ఎవరి ఖాతాలో పడబోతోంది? జన్ జీ ఉద్యమం, ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ప్రభుత్వం ఈ ఎన్నికలపై ఎలా చూపబోతోంది అనేది తెలియాలంటే ఆగస్టు 3 వరకు ఆగాల్సిందే.

Next Story