మా నాన్న చెప్పారు.. అందుకే మా సోదరిని రానివ్వలేదు: ముద్రగడ గిరిబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-26 09:09:16  IST  )

కాపు ఉద్యమ నేత ముడ్రగడ పద్మనాభం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియల్లో కుమర్తె క్రాంతిని పాల్గొననివ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ..

మా నాన్న చెప్పారు.. అందుకే మా సోదరిని రానివ్వలేదు: ముద్రగడ గిరిబాబు
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముడ్రగడ పద్మనాభం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియల్లో కుమర్తె క్రాంతిని పాల్గొననివ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందకముందు తన అంత్యక్రియలకు కుమార్తె క్రాంతిని రానివొద్దని చెప్పారని తెలిపారు. అందువల్లే తాము సోదరి క్రాంతిని తన తండ్రి అంత్యక్రియలకు రానివ్వలేదని స్పష్టం చేశారు. కానీ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకొచ్చారని మండిపడ్డారు. బౌన్సర్లను పెట్టుకుని క్రాంతి వచ్చారని, వాళ్లెవరినీ తాను మర్చిపోనని హెచ్చరించారు. పెద్దలతోనే, కుటుంబ సభ్యులతోనే వచ్చి ఉంటే క్రాంతికి గౌరవం ఉండేదన్నారు. అలాగ వచ్చినట్లైతే తన తండ్రి మాటను పెక్కన పెట్టి, తన తల్లిని ఒప్పించి ముద్రగడ అంత్యక్రియలకు క్రాంతిని రానిచ్చేవాళ్లమని గురి చెప్పారు. కానీ రౌడీలు, గుండాలు, దుర్మార్గులు, పోలీసులతో క్రాంతి వచ్చిందన్నారు. తన సోదరి క్రాంతిని ఎప్పటికీ క్షమించకూడదన్నారు. ఇలాంటి వాళ్లు సమాజానికి చీడ పురుగులే తప్ప, మంచి కోరే మనుషులు కాదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీని తన సోదరి క్రాంతి వాడుకుంటోందని ముద్రగడ గిరిబాబు ఆరోపించారు.

Next Story