- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా రంగంలో సమూల మార్పులు రావాలి:రవిషా
ఇది చారిత్రాత్మక పోరాటం, ఇలాంటి రోజు రావడం చాలా ఆనందంగా ఉందని సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు రవిషా అన్నారు.

దిశ, రాంనగర్: ఇది చారిత్రాత్మక పోరాటం, ఇలాంటి రోజు రావడం చాలా ఆనందంగా ఉందని సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు రవిషా అన్నారు. విద్యార్థుల గొంతుకు మద్దతుగా, విద్యారంగంలో మార్పు కోసం చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఇవాళా (ఆదివారం ) హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 'వీ స్టాండ్ టుగెదర్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవిషా మాట్లాడుతూ.. పదవిలో ఉన్నవాళ్లను దింపడం అంత తేలిక కాదు, ఇది అవ్వదులే, ఇది కాదులే అని అందరూ అనుకుంటారని, అందరూ ఐక్యమత్యంగా ఉండడం వల్లనే ఇది చారిత్రక పోరాటంగా మారిందని పేర్కొన్నారు.
ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా కోసం చేసిన పోరాటం కాదని, విద్యా రంగంలో సమూల మార్పులు రావాలని అన్నారు. రాజీనామాతోనే పోరాటం ముగియదని, తమ అకౌంటబిలిటీని ఇలాగే కొనసాగిస్తూ అందరూ ఐక్యతతో ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.పరీక్షల వైఫల్యాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని, ఇకమీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ పై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి తక్షణ సంస్కరణలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో దిశ విద్యార్థి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు






