- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజూ స్నానం చేయడం.. చర్మానికి హానికరమా..?
రోజూ అలాంటి అలవాటు కారణంగా చర్మం సహజ రక్షణను కోల్పోయి దీర్ఘకాలంలో బలహీనపడవచ్చు!

దిశ, ఫీచర్స్ : పరిశుభ్రతతో భాగంగా ప్రతిరోజూ స్నానం చేస్తున్నారా? కానీ ఇలా చేయడం అంతమంచిది కాదంటున్నారు డెర్మటాలజిస్టులు. పైగా చర్మానికి హానికరమని చెబుతున్నారు. బదులుగా వారానికి రెండు మూడుసార్లు చేయడం మొత్తం ఆరోగ్యానికి శ్రేయస్కరమని చెబుతున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధలకు అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. అయితే దీనివల్ల కలిగే లాభ నష్టాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం జరుగుతుంది?
ప్రతిరోజూ సాధారణంగా నీటితో స్నానం చేస్తే పెద్ద నష్టమేమీ లేకపోవచ్చు. కానీ ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సబ్బు తప్పకుండా వాడుతుంటారు. దీంతో చర్మంలోని సహజ నూనెలు (sebum) తొలగిపోయి, ఉపరితలంపై ఉండే సూక్ష్మజీవుల సమతుల్యం (మైక్రోబయోమ్) దెబ్బతింటుంద డెర్మటాలజిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చర్మం పొడిబారడం, దురద, ఎర్రబడడం, సున్నితత్వం(Sensitivity) వంటి సమస్యలు ఎదురవుతాయి. చర్మం తన సహజ రక్షణను కోల్పోయి దీర్ఘకాలంలో బలహీనపడుతుంది.
వారానికి మూడుసార్లు
హార్వర్డ్ మెడికల్ స్కూల్ సిఫార్సు ప్రకారం.. చాలా మందికి వారానికి 2 నుంచి 3 సార్లు స్నానం చేయడం సరిపోతుంది. మధ్యలో చెమట, మురికి ఉన్న ప్రాంతాలను (ఆక్సిల్లా, గ్రోయిన్) మాత్రం స్పాట్ క్లీనింగ్ చేసుకోవచ్చు. సబ్బులేకుండా కేవలం చల్లని లేదా వేడి నీటితో చిన్న చిన్న స్నానాలు (3-4 నిమిషాలు) మంచిది. రోజువారీగా స్నానం చేయకపోవడంవల్ల చర్మం సహజంగా రికవరీ అయి, తేమను నిలుపుకుంటుంది. దీంతో స్కిన్ హెల్త్ మెరుగుపడుతుంది.
రోజూ చేయడం వెనుక కారణం?
నిజానికి రోజువారీ స్నానం అలవాటు అనేది 1900ల ప్రారంభంలో సబ్బు కంపెనీల వ్యాపారం, మార్కెటింగ్ క్యాంపెయిన్ల ద్వారా వచ్చింది తప్ప ఇది వైద్య సలహా కాదని ఆరోగ్య నిపుణులు, డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అంతేతప్ప చర్మ ఆరోగ్యానికి రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదని, వారానికి కొన్ని సార్లు చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అయితే వ్యక్తి జీవనశైలి, వాతావరణం, చర్మం రకాన్ని బట్టి ఈ ఫ్రీక్వెన్సీ మారవచ్చు. ఉదాహరణకు రోజంతా బురదలో లేదా ధూళిలో పనిచేసినప్పుడు స్నానం తప్పని సరి అవుతుంది. సాధారణంగా బయటి వాతావరణంలో తిరగకుండా దుమ్మూ, ధూళికి గురికాకుండా ఉండేవారికి రోజూ స్నానం అవసరం లేదు. మొత్తానికి చర్మం సహజ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే అతిగా స్నానం చేయకపోవడం, చేసినప్పుడు సబ్బులకు బదులు మైల్డ్ క్లెన్జర్లు వాడటం మంచిదని మంచిదని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






