‘దిశ’ కథనానికి స్పందించిన జాతీయ రహదారి అధికారులు

by Jakkula.Mamatha |

‘దిశ’లో శనివారం ప్రచురితమైన వార్త కథనానికి జాతీయ రహదారి అధికారులు స్పందించారు.

‘దిశ’ కథనానికి స్పందించిన జాతీయ రహదారి అధికారులు
X

దిశ, రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరుగుతున్న మరమ్మతు పనుల్లో నిర్లక్ష్యం, బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే అంశంపై "జాతీయ రహదారిపై మరమ్మతుల నిర్లక్ష్యం.. ప్రమాదాలకు కారకులు ఎవరు?" అనే శీర్షికతో ‘దిశ’లో శనివారం ప్రచురితమైన వార్త కథనానికి జాతీయ రహదారి అధికారులు స్పందించారు.

రోడ్డు విభాగం ఇంజనీర్ సురేంద్ర మాట్లాడుతూ.. డాంబర్ కొరత కారణంగా గత కొన్ని రోజులుగా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయామని తెలిపారు. సోమవారం నాటికి డాంబర్ అందుబాటులోకి వస్తుందని, మంగళవారం నుంచి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. పనులు పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, ఇతర భద్రతా చర్యలు చేపడతామని ఆయన ‘దిశ’ ప్రతినిధితో పేర్కొన్నారు. స్థానికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story