- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి:సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య
మున్సిపల్ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకటించిన తర్వాతే కూల్చివేతలు అమలు చేయాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు.

దిశ, గోదావరిఖని: మున్సిపల్ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకటించిన తర్వాతే కూల్చివేతలు అమలు చేయాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, కానీ కార్యాలయంలో అనేక ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం దారుణమని అన్నారు. కార్పొరేషన్ లో 50 డివిజన్లకు గాను శాంక్షన్ అయిన పోస్టులు 257 ఉండగా నేడు 60 డివిజన్‌లకు కేవలం 113 మంది మాత్రమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇంకా 144 పోస్టులు ఖాళీగానే ఉన్న వీటిని పూర్తి చేద్దాం అనే చిత్తశుద్ధి ఇటు పాలకుల గాని అటు జిల్లా కలెక్టర్ గారికి లేకపోవడం దారుణమైన చర్య అని అన్నారు.
రామగుండం కార్పొరేషన్ లో అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో సూపరిండెంట్, ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేకపోవడంతో డీఈలు ముగ్గురికి కేవలం ఇద్దరే పని చేస్తున్నారని వివరించారు. ఆ ఇద్దరిలో ఒకరికి ఎస్ ఈ (ఎఫ్ ఏ సి)ఇవ్వడం వల్ల ఒకరి పైనే పూర్తి పని భారం పడుతుందని అన్నారు. డివిజన్లకు ఫీల్డ్ వర్క్ వెళ్లాల్సిన మున్సిపల్ ఏఈలు ఏడుగురికి గాను కేవలం నలుగురే ఉండడం వల్ల కనీసం కార్పొరేటర్లు వాళ్ల యొక్క డివిజన్‌లో పనులు ఎస్టిమేట్ చేయించుకోవడానికి పిలిస్తే కనీసం టైం ఇవ్వలేని ప్రస్తుతం ఉన్నాయన్నారు. ఏఈల మీద పని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ సుందరంగా ఉండాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం ఎంతో కీలకమని, కానీ టౌన్ ప్లానింగ్ ఏసీపీలు ఇద్దరు ఉండాల్సిన దగ్గర ఒక్కరే ఉన్నారన్నారు.
ఒకరు డిప్యూటేషన్ మీద ఉండటం వల్ల ఒక్కరే టౌన్ ప్లానింగ్ సెక్షన్ ను గుత్తాధిపత్యంగా పూర్తి అవినీతికి తెరలేపారని విమర్శించారు. రాజకీయ అండదండలతో టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమ కట్టడాలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ లోని ఇంజనీరింగ్ విభాగం మరియు టౌన్ ప్లానింగ్ విభాగం పైన విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని దుయ్యబట్టారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కమిషనర్, మాస్టర్ ప్లాన్ లేకుండానే ఇష్టం వచ్చినట్లు దుకాణాలను ఇండ్లను కూల్చడం సరికాదన్నారు. కనిపించిందల్లా తొలగించుకుంటూ పోతామంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని, కమిషనర్‌ను మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్, మడికొండ ఓదమ్మ , ఆసాల రమ, శనిగరపు చంద్రశేఖర్ , సిరిసిల్ల మల్లేష్, కౌన్సిల్ సభ్యులు రాణవేణి సుధీర్ కుమార్, ఆశాల నవీన్, సాదుల శివ, అబ్దుల్ కరీం, తిరుమల మరియు నాయకులు పోతరాజు నాగరాజు, అనూప్ సాయి, మసూద్ ఇతరులు పాల్గొన్నారు.






