- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన నటుడికి భారీ సాయం
చిరంజీవి, ఆస్పత్రి ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తన వంతుగా రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించారు.

దిశ, సినిమా: ఎంతోమంది అభిమానుల కష్టాల్లో అండగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్ ఇటీవల తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి స్పందించారు. ఆసుపత్రి వర్గాలతో మాట్లాడిన మెగాస్టార్, వైద్యుడు డాక్టర్ సుబ్బారెడ్డిని అడిగి రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అనంతరం రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి, ఆస్పత్రి ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తన వంతుగా రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంతటితో ఆగకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా రమేశ్ వైద్యానికి తగిన సహాయం అందేలా ప్రభుత్వంతో మాట్లాడి సిఫార్సు చేస్తానని ఆయన కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇక చిరంజీవి తమ్ముడు, నటుడు నాగబాబు కూడా రమేశ్ కుటుంబానికి అండగా నిలుస్తూ రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కష్టసమయంలో తోటి నటుడిని ఆదుకోవడానికి మెగా బ్రదర్స్ ముందుకు రావడం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసును కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






