మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్.. ‘దీవాన’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు

by Mallepaka Hamsa |

ఇప్పుడీ సూపర్ హిట్ ప్రేమకథ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది.

మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్.. ‘దీవాన’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దివాన’. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి కలిసి నిర్మించారు. ఈ ఏడాది జూన్ 20న ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిన్న సినిమా, బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించింది. గుండెకు హత్తుకునే ఎమోషన్స్, ఆకట్టుకునే లవ్ స్టోరీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందడమే కాకుండా వసూళ్ల పరంగానూ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సూపర్ హిట్ ప్రేమకథ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది.

ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రాబోతోంది. ఈ అప్‌డేట్‌ను ఇస్తూ ఆహా టీమ్ "మిస్ అయితే మస్త్ ఫీల్ అవుతవ్" అని ఆసక్తికర క్యాప్షన్‌ను జోడించి పోస్ట్ చేసింది. ఈ మూవీ కథ విషయానికొస్తే.. నగరంలో సాధారణ జీవితం గడిపే ఒక యువకుడు, అనుకోకుండా ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. మొదట ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలు, వారి మధ్య వచ్చే కొన్ని చిన్న చిన్న గొడవలు ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా గాఢమైన ప్రేమగా మారతాయి. అయితే, వీరిద్దరి జీవితాల్లోకి ఎదురయ్యే ఒక అనుకోని పెద్ద సమస్య వారి బంధాన్ని తీవ్రమైన పరీక్షలోకి నెడుతుంది. ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితులు దాపురించినప్పుడు, ఆ విధిని ఎదురించి తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేది ఈ చిత్రంలో అత్యంత భావోద్వేగంగా చూపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

Next Story