ఇతరులను చూసి నన్ను నేను మార్చుకోలేదు.. అందుకే ఈ స్థాయికి వచ్చా: రష్మిక మందన్న

by Mallepaka Hamsa |

హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న సమయంలో అందరిలా ఒకే తరహా దారిలో వెళ్లకుండా, తన అంతరాత్మ చెప్పిన మాటే విన్నానని అందుకే ఈ స్థాయిలో ఉన్నానని రష్మిక అన్నారు.

ఇతరులను చూసి నన్ను నేను మార్చుకోలేదు.. అందుకే ఈ స్థాయికి వచ్చా: రష్మిక మందన్న
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఎన్నో హిట్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా మారిపోయారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీ అయిపోయారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ‘మైసా’లో అండర్ వాటర్‌లో బిగ్ అడ్వెంచర్ చేశారు. ఇప్పటివరకూ ఇండియన్ సినీ చరిత్రలో చూడని ఓ బిగ్ సీక్వెన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. గొండ్ తెగ, సంస్కృతి నేపథ్యంతోపాటు వారికి అండగా ఉండే ఓ వారియర్ పాత్రలో గొండు మహిళగా రష్మిక ఇందులో కనిపించబోతున్నారు. రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ బిజీగా ఉన్న రష్మిక తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా సినీ ఇండస్ట్రీలో అందరూ వెళ్లే దారిలోనే తాను వెళ్లలేదని.. ఎప్పుడూ తన మనసుకు నచ్చినట్లే నడుచుకున్నానని చెప్పారు. అదే తన విజయంలో అతిపెద్ద కారణమని వెల్లడించారు.

హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న సమయంలో అందరిలా ఒకే తరహా దారిలో వెళ్లకుండా, తన అంతరాత్మ చెప్పిన మాటే విన్నానని అందుకే ఈ స్థాయిలో ఉన్నానని రష్మిక అన్నారు. మొదట్లో ఈ నిర్ణయం కాస్త భయాన్ని కలిగించినప్పటికీ, చివరికి అదే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని తెచ్చిపెట్టిందని చెప్పారు. ఇతరులను అనుకరించడం లేదా పక్కవారి మెప్పు కోసం జీవించడం కాకుండా.. ఎవరికి వారు తమ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయమని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు స్పూర్తినిచ్చే సందేశాన్ని ఇస్తూ.. ఎవరినీ చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. పక్కవారి మెప్పు కోసం లేదా ప్రశంసల కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మనం ఎలా ఉన్నామో అలాగే నిజాయితీగా ఉండటంలోనే మన అసలైన విలువ ఉంటుంది. మన వ్యక్తిత్వమే మనకు అతిపెద్ద బలం అని స్పష్టం చేశారు.

Next Story