రాజన్న ఆలయ అభివృద్ధితో వేములవాడకు మహర్దశ

by Taduka Kalyani |

దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

రాజన్న ఆలయ అభివృద్ధితో వేములవాడకు మహర్దశ
X

దిశ, వేములవాడ : దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజా నిధుల మంజూరుతో ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు రూ.249.40 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ​రాజన్న ఆలయాభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో వైస్ చైర్మన్, పాలకవర్గ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభివృద్ధిపై చర్చించారు. ​అనంతరం చైర్మన్ రాజు మాట్లాడుతూ.. వేములవాడ పుణ్యక్షేత్రానికి మహర్దశ పట్టిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిరంతర కృషి, పట్టుదలతోనే రాజన్న ఆలయానికి రూ.249.40 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయని కొనియాడాడు. వేములవాడ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తో పాటు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహా ఇతర మంత్రులకు మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ​దేశంలోనే అత్యంత ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం దశలవారీగా నిధులు విడుదల చేస్తోందని, త్వరలోనే భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి వేములవాడ పట్టణం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగానూ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపాడు. శృంగేరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారి సలహాలు, సూచనలతో పనులను అభివృద్ధి, విస్తరణ ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశాడు.

Next Story