ట్రాఫిక్ సమస్య లేకుండా చూడండి : మోడీ సభపై మంత్రుల సమీక్ష

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-26 11:13:30  IST  )

ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లపై.. జీఎంఆర్ ఎయిర్ పోర్టులో మంత్రులు సమీక్షించారు.

ట్రాఫిక్ సమస్య లేకుండా చూడండి : మోడీ సభపై మంత్రుల సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లపై.. జీఎంఆర్ ఎయిర్ పోర్టులో మంత్రులు సమీక్షించారు. విజయనగరం జిల్లా సహా.. ఉత్తరాంధ్రలోని పలు నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణకు తీర్మానం చేశారు. సభకు విచ్చేసే వారి వాహనాల పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందుకు లేకుండా ప్రైవేట్ పార్కింగ్ ప్లేసులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. బహిరంగ సభకు వచ్చేవారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్థన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక రూట్లు ఏర్పాటు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. ఉదయం 10.30 గంటల నుంచి మోదీ పర్యటన ప్రారంభమవుతుండగా.. ఎయిర్ పోర్టులో 13 వేలమందితో అరకు థింసా గిరిజన నృత్యంతో మోడీకి ఘనస్వాగతం పలుకనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 6వేల మంది, పార్వతీపురం మన్యం నుంచి 5వేలు, పోలవరం జిల్లా నుంచి 2 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా థీంసా నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 గంటలకే ప్రజలంతా వేదిక వద్దకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story