Commonwealth Games 2026: స్నాచ్ విభాగంలో రికార్డు సృష్టించిన భారత వెయిట్‌లిఫ్టర్ రిషికాంత్ సింగ్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-26 11:29:15  IST  )

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత వెయిట్‌లిఫ్టర్ రిషికాంత్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

Commonwealth Games 2026: స్నాచ్ విభాగంలో రికార్డు సృష్టించిన భారత వెయిట్‌లిఫ్టర్ రిషికాంత్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ 2026 గేమ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భారత వెయిట్‌లిఫ్టర్ రిషికాంత్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల 60 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్ (Snatch) పోటీలో ఆయన ఏకంగా 121 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి, కామన్వెల్త్ క్రీడల ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టారు. తన అద్భుతమైన ప్రతిభతో సరికొత్త గేమ్‌ రికార్డు నెలకొల్పి అంతర్జాతీయ వేదికపై భారత్ పేరును మరోసారి ప్రమోజ్జ్వలంగా నిలిపారు.

ఈ విభాగంలో ఓవరాల్‌గా రజత పతకాన్ని (Silver Medal) సొంతం చేసుకున్న రిషికాంత్, స్నాచ్ విభాగంలో నెలకొల్పిన ఈ కొత్త రికార్డుతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పోటీ ఆద్యంతం స్థిరత్వం తో పాటు అపారమైన మానసిక సమతుల్యతను ప్రదర్శించి దేశానికి పతకాన్ని అందించిన రిషికాంత్ సింగ్‌ను క్రీడా వర్గాలు, అభిమానులు విపరీతంగా ప్రశంసిస్తున్నారు.

Next Story