- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామస్థాయి నుంచి ఎమ్మార్పీఎస్‌ను బలోపేతం చేయాలి: మందకృష్ణ మాదిగ
by Ratna Kumari |
గ్రామస్థాయి నుంచి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

X
దిశ, భిక్కనూరు : గ్రామస్థాయి నుంచి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కర్రోల రాజు మర్యాదపూర్వకంగా మందకృష్ణ మాదిగను కలిశారు. ఇటీవల వార్డు సభ్యుడిగా ఎన్నికైన కర్రోల రాజును ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి ఎమ్మార్పీఎస్‌ను పటిష్టం చేసేందుకు కొత్త కమిటీల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా యువతను చైతన్యపరుస్తూ ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సిన బాధ్యత యువ నాయకులపై ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా గ్రామస్థాయి నుంచి కార్యాచరణ చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Next Story






