- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి : ఎస్సై పోచయ్య
by Batti.Sumithra |
గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రేగోడ్ ఎస్సై పోచయ్య సూచించారు. మండలంలోని గజ్వాడలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు.

X
దిశ, రేగోడ్ : గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రేగోడ్ ఎస్సై పోచయ్య సూచించారు. మండలంలోని గజ్వాడలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. మహిళలు వ్యవసాయ భూములకు వెళ్లి వచ్చేటప్పుడు బంగారు ఆభరణాల విషయంలో తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మాయమాటలతో పలకరించిన చోట నమ్మి మోసపోకూడదని చెప్పారు. 18 సంవత్సరాలు నిండని చిన్నారులకు వివాహాలు చేయకూడదన్నారు. వాహనదారులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాట్సప్ లో లింకులు పంపితే స్పందించకూడదని, బ్యాంకు ఉద్యోగులమని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు.
Next Story






