మెగాస్టార్ బర్త్ డే కానుకగా ‘మెగా-158’ నుంచి బిగ్ అప్డేట్.!

by Mallepaka Hamsa |

మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మెగాస్టార్ బర్త్ డే కానుకగా ‘మెగా-158’ నుంచి బిగ్ అప్డేట్.!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి వరుస భారీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరించడంతో పాటు యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదల కాకముందే.. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ మూవీపై భారీ అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘మెగా-158’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ఘనంగా నిర్మిస్తున్నారు.

యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ విలన్‌గా నటిస్తుండగా, కమెడియన్ డాక్టర్ భద్రం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక పోస్టర్ లేదా అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వచ్చే నెల ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భం గా ఈ సినిమాకు సంబంధించిన ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని టాక్.

Next Story