‘ఇతర దేశాల్లో అయితే కాల్చి చంపేవారు’: జెన్‌Z ప్రొటెస్ట్‌పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ (Gen Z) విద్యార్థులు చేపట్టిన నిరసనలపై చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఇతర దేశాల్లో అయితే కాల్చి చంపేవారు’: జెన్‌Z ప్రొటెస్ట్‌పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ (Gen Z) విద్యార్థులు చేపట్టిన నిరసనలపై చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశం కాబట్టి పోలీసులు కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేసి వదిలేశారని, అదే విదేశాల్లో అయితే ఇలాంటి నిరసనకారులను షూట్ చేసి కాల్చి పడేస్తుండేవారని ఆయన ఆరోపించారు. నీట్ (NEET) పేపర్ లీకేజ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోడీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ ఆందోళనల వెనుక విచ్ఛిన్న శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు.

విదేశీ డబ్బులు..

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపడుతున్న ఈ ఉద్యమం విదేశీ నిధులతో నడుస్తోందని, విదేశీ డబ్బులతోనే ఢిల్లీలో ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు హింసాత్మకంగా మారడంతోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులతో పాటు అక్కడికి వచ్చిన ఇతర రాజకీయ నాయకులపై హత్యాయత్నం కేసులు (Attempt to Murder Cases) నమోదు చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story