- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల విజయాన్ని సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు: కవిత
విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా అంటూ ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. గత 36 రోజులుగా దేశంలో అనేకమంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్న ఉద్యమం విజయం సాధించిందని అన్నారు. వారు అనుకున్నట్టుగానే ధర్మంద్ర ప్రధాన్ ను కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేసేందుకు ముందుకు పంపిందన్నారు. ఇది నూటికి నూరు శాతం విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తుందని చెప్పారు. విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అని విమర్శించారు.
హైదరాబాద్ లో దాదాపు 3గంటల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారని చెప్పారు. యువత తమను ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోనే రేవంత్ రెడ్డి ముందుగానే కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు. అనేక సందర్భాల్లో యువతను, విద్యార్థులను మోసం చేసిన రేవంత్ రెడ్డి 21ఏళ్లకే యువతను పార్లమెంట్ పంపాలనే ఆలోచన చేయడం సంతోషకరమని అన్నారు. కానీ రేవంత్ రెడ్డిపై నమ్మకంలేదని, ఏ బిల్లు పెట్టినా ఆయన కేంద్రంతో లాలూచీ పడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు మర్చిపోవాలని కొవ్వత్తులు పట్టుకుని నగరవీధుల్లో ఊరేగితే ఎవరూ నమ్మరని మండిపడ్డారు. ఈ విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని చెప్పారు.






