- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినో విలయం.. వానల్లేక ఎండిపోతున్న చేన్లు.. ఆకాశం వైపు దీనంగా రైతన్నలు!
by Jakkula.Mamatha |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.

X
దిశ,డోర్నకల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. వానలు లేక, విత్తనాలు మొలకెత్తక చేనులోనే ఎండుతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లా కరుణించి కరువు కోరల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పచ్చని పంటలతో అన్నదాతల ఇల్లు కళకళలాడాలని దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. మానవాళితో పాటు తాగునీరు లేక అల్లాడుతున్న మూగజీవాలు, పశుపక్ష్యాదుల దాహం తీరాలని మత పెద్దలు అల్లాకు దువా జరిపారు. మత గురువు ఆఫీజ్ సుల్తాన్, మజీద్ కమిటీ ప్రెసిడెంట్ సలీం పాషా, ఖాదర్ బాబా, గౌస్, అస్గర్, నవాబు, ఫరీద్, జావిద్ తదితరులున్నారు.
Next Story






