- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రి రాముని దయతోనే 'సీతారామ ప్రాజెక్టు' కల సాకారమైంది: మంత్రి తుమ్మల
ప్రత్యక్ష రాజకీయాల కంటే గ్రామాభివృద్ధే ధ్యేయంగా బిల్లుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా జక్కంపూడి కృష్ణమూర్తి చేసిన సేవలు ఎనలేనివని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు.

దిశ,తల్లాడ: ప్రత్యక్ష రాజకీయాల కంటే గ్రామాభివృద్ధే ధ్యేయంగా బిల్లుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా జక్కంపూడి కృష్ణమూర్తి చేసిన సేవలు ఎనలేనివని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. నా ఆప్తమిత్రుడు, చిరకాల సహచరుడు ఇక లేడనే నిజాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నానని మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జక్కంపూడి కృష్ణమూర్తి - ప్రేమలత దంపతుల ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు జక్కంపూడి కిషోర్ ఆధ్వర్యంలో బిల్లుపాడు గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు రక్తదాన శిబిరాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు జక్కంపూడి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఈ సేవా కార్యక్రమానికి పరిసర 27 గ్రామ పంచాయతీల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి మట్టా రాగమయి రోగులకు స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా రక్త దాతల ద్వారా బ్లడ్ డొనేషన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తన మిత్రుడు కృష్ణమూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నాణ్యమైన రోడ్లు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు, రైతులకు జీవనాధారమైన సాగునీరు అందించాలనేదే మా ఇద్దరి రాజకీయ ఆకాంక్ష. 1997-98 లో దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మేం చర్చించుకున్నప్పుడు అది ఏ విధంగా సాధ్యమవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ రోజు భద్రాద్రి శ్రీరామచంద్రుని దయ వల్ల ఆ కల 'సీతారామ ప్రాజెక్టు'గా రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పాడిపంటలతో సస్యశ్యామలం కాబోతోంది" అని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జక్కంపూడి కిషోర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వైద్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.






