- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల లాఠీఛార్జ్‌పై నిలదీత.. అమిత్ షాకు రాహుల్ గాంధీ ఘాటు లేఖ
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లతో వాడకంపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘాటుగా లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో జూలై 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై భద్రతా దళాలు జరిపిన లాఠీఛార్జ్, దాడి ఘటనపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)కు ఆయన జూలై 25న ఓ బహిరంగ లేఖ రాశారు. జూలై 20న మెరుగైన, పారదర్శక విద్యా వ్యవస్థ కోసం శాంతియుతంగా ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై భద్రతా దళాలు రాక్షసంగా దాడి చేశాయని, బాష్పవాయువు గోళాలు, పెల్లెట్ గన్లతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారని లేఖలో ప్రస్తావిస్తూ మండిపడ్డారు. వందలాది మంది విద్యార్థులు, మహిళా విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రాణాంతక పెల్లెట్ తుపాకులు ఉపయోగించడం కలచివేసిందని తెలిపారు. 19 ఏళ్ల సాహిల్ లోచాబ్ అనే విద్యార్థి పెల్లెట్ దాడి వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని, ఆయనను స్వయంగా కలిసి పరామర్శించినట్లుగా లేఖలో వెల్లడించారు.
అమిత్ షాకు సూటి ప్రశ్నలు..
విద్యార్థులపై పెల్లెట్ తుపాకులు, బలప్రయోగానికి హోంశాఖ మంత్రిగా మీరు అనుమతి ఇచ్చారా.. ఇవ్వకపోతే ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇక మఫ్టీలో వచ్చి విద్యార్థులపై లాఠీలతో దాడి చేసిన వ్యక్తులు పోలీసులు లేక వాలంటీర్లా.. వారిని ఎవరు నియమించారని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలుపడం పౌరుల హక్కు అని, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. ఎప్పటికీ విద్యార్థుల గొంతు మాత్రం నొక్కలేరనే విషయాన్ని గమనించాలని రాహుల్ గాంధీ తన లేఖలో ప్రస్తవించారు. అయితే, కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన మరుసటి రోజే రాహుల్ గాంధీ ఇలా బహిరంగ లేఖ రాయడం ప్రస్తుతం హస్తిన రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






