సీఎం కుర్చీ ఊడుతుంది జాగ్రత్త!.. సీఎం రేవంత్‌కు డీకే అరుణ వార్నింగ్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సీఎం కుర్చీలో కూర్చోలేరని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

DK Aruna
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సీఎం కుర్చీలో కూర్చోలేరని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసలు ఏం జరిగిందో, అక్కడి చోటుచేసుకున్న అల్లర్లకు బాధ్యులు ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తెచ్చారని ఆరోపించారు.

రాహుల్ మెప్పు కోసం కాదు.. ప్రజల కోసం పనిచేయాలి..

ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని డీకే అరుణ హితవు పలికారు. రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం పనిచేయడం వెంటనే ఆపేసి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వారి సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Next Story