CM రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. భారత్ నుంచి ఒక్కరే

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 04:31:56  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది.

CM రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. భారత్ నుంచి ఒక్కరే
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అరుదైన గౌరవం లభించింది. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌(Harvard Kennedy School) నిర్వహించే తొలి AI సదస్సుకు చీఫ్ గెస్ట్‌గా హాజరై ప్రసంగించాలని రేవంత్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సదస్సుకు భారత్ నుంచి ఆయనకొక్కరికే ఆహ్వానం అందడం విశేషం. మరోవైపు అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్‌ యూనివర్సిటీలో తన చివరి రోజున సీఎం రేవంత్‌రెడ్డి వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు యూనివర్సిటీలోని పలు పాఠశాలల విద్యార్థులు, ఎంఐటీ, కొలంబియా వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు, పూర్వవిద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వం, విజయాల సాధన, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి నమూనాలు, స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమం, మహిళలు-యువత సాధికారత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సోమవారం తెల్లవారుజామున సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రానున్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి హాజరుకానున్న ఆయన.. అదేరోజున వీలునుబట్టి మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల గురించి చర్చిస్తారని సమాచారం.

Read More..

Budget 2026-2027: స్వాతంత్య్ర భారతంలో ఇదే తొలిసారి

Next Story